ఫిజికల్ రిసర్చ్ లేబొరేటరీ (పీఆర్‌ఎల్) ప్రొఫెసర్ కుల్జీత్ కౌర్ మర్హాస్ 2026 ఏడాదికి ప్రతిష్ఠాత్మక ‘మెటియోరిటికల్ సొసైటీ’ ఫెలోగా ఎంపికయ్యారు. ఉల్కాశాస్త్రం, గ్రహ విజ్ఞానశాస్త్రంలో ఈ అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం ఆమె అహ్మదాబాద్‌లోని పీఆర్‌ఎల్‌లోని ప్లానెటరీ సైన్స్ డివిజన్‌లో పనిచేస్తున్నారు.
‘మెటియోరిటికల్ సొసైటీ’ అనేది ఉల్కలు, గ్రహ పదార్థాలు, సౌర వ్యవస్థ పరిశోధనకలు సంబంధించిన ఒక అంతర్జాతీయ శాస్త్రీయ సంస్థ. గ్రహాలకు సంబంధించిన ప్రయోగాలు, అధ్యయనాలు నిర్వహించే పరిశోధకులను దీనికి ఫెలోగా ఎంపిక చేస్తారు.