సరికొత్త ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి సార్మాట్‌ను రష్యా 2026, మే 12న పరీక్షించింది. అణ్వస్త్ర బలగాలను బలోపేతం చేయడంలో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. దీన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన క్షిపణిగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సోవియట్ కాలం నాటి వోయేవోడ అస్త్రాల స్థానంలో దీన్ని ప్రవేశపెడతారు. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన సార్మాట్ క్షిపణి 2026 చివర్లోగా సైనిక దళాల్లో చేరుతుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు.