స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన గ్లైడ్ ఆయుధ వ్యవస్థను ఒడిశా తీరానికి చేరువలో భారత రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది. ట్యాక్టికల్ అడ్వాన్స్‌డ్ రేంజ్ ఆగ్మెంటేషన్ (తార) అనే ఈ వ్యవస్థ సాయంతో అన్‌గైడెడ్ వార్‌హెడ్‌లను అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగల గైడెడ్ అస్త్రాలుగా మార్చవచ్చు. దేశీయంగా తయారుచేసిన తొలి గ్లైడెడ్ ఆయుధ వ్యవస్థ ఇదే.