రక్షణ రంగ సంస్థ జెన్ టెక్నాలజీస్ కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత యాంటీ-డ్రోన్ వ్యవస్థను ఆవిష్కరించింది. పెరుగుతున్న డ్రోన్ దాడుల ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించినట్లు తెలిపింది. ఈ సరికొత్త వ్యవస్థ 15 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న 100కు పైగా డ్రోన్లను ఒకేసారి పసిగట్టి, కచ్చితత్వంతో ధ్వంసం చేయగలదు.