పిండం అభివృద్ధిలో రహస్యాల ఛేదన

పిండం అభివృద్ధిలో రహస్యాల ఛేదన
  • జీవుల పెరుగుదల, పిండం అభివృద్ధి వెనక ఉన్న రహస్యాలను ఛేదించడంలో శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. క్షీరదాలలో కణాల కదలికలను నియంత్రించే ర్యాప్‌జెఎఫ్‌1 అనే జన్యువుపై సీసీఎంబీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. జీబ్రా చేపలపై నిర్వహించిన ప్రయోగం ద్వారా మెదడు, వెన్నెముక నిర్మాణంలో ఈ జన్యువు కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు గుర్తించారు.
  • మానవ జన్యువులతో పోలిక ఉండే జీబ్రా చేపల్లో ర్యాప్‌జెఎఫ్‌1ఏ, ర్యాప్‌జెఎఫ్‌1బీ అనే రెండు రకాల జన్యువులను విశ్లేషించారు. ర్యాప్‌జెఎఫ్‌1బీ జన్యువును తొలగించి పరిశీలించగా పిండం పెరుగుదలతో మార్పులు గమనించారు. ఈ జన్యువు లేకపోవడంతో కణ విభజన సమయంలో క్రోమోజోమ్‌ల అమరిక సైతం దెబ్బతింది. ఈ పరిశోధన ఫలితాలు భవిష్యత్తులో మానవులలో తలెత్తే పురిటి లోపాలకు చికిత్సను కనుగొనడానికి ఎంతో దోహదపడతాయని పరిశోధన బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram