మరణాలు

మరణాలు
  • తెలంగాణలో 2023తో పోల్చితే 2024లో వ్యవసాయరంగంలో నిమగ్నమైన వారిలో బలవన్మరణాల సంఖ్య తగ్గినట్లు జాతీయ నేరగణాంక సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) 2026, మే 7న విడుదల చేసిన నివేదిక వెల్లడిస్తోంది. 2022లో 178.. 2023లో 56 మంది ఆత్మహత్యకు పాల్పడగా.. 2024లో 43 మంది మరణించినట్లు నివేదిక స్పష్టం చేసింది. 2024లో ఈ రంగానికి సంబంధించి దేశవ్యాప్తంగా అత్యధిక బలవన్మరణాలు మహారాష్ట్రలో 2,269 నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో కర్ణాటక(1,770), మధ్యప్రదేశ్‌(110), ఉత్తర్‌ప్రదేశ్‌(99) ఉన్నాయి. తెలంగాణ తొమ్మిదో స్థానంలో ఉంది. 
  • దేశవ్యాప్తంగా 2024లో మొత్తం 1,70,746 ఆత్మహత్యలు చోటుచేసుకోగా తెలంగాణలో నమోదైనవి 10,975(6.4శాతం). అత్యధికంగా మహారాష్ట్రలో 22,174మంది(13శాతం).. తమిళనాడులో 19,965మంది(11.7శాతం) చోటు చేసుకున్నాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram