సీఐటీడీ, హైదరాబాద్‌లో లేటరల్‌ ఎంట్రీ డిప్లొమా కోర్సులు

సీఐటీడీ, హైదరాబాద్‌లో లేటరల్‌ ఎంట్రీ డిప్లొమా కోర్సులు

హైదరాబాద్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ), 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ డిప్లొమా ప్రోగ్రామ్‌లలో లేటరల్ ఎంట్రీ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 

వివరాలు:

1. డిప్లొమా ఇన్ టూల్, డై అండ్‌ మౌల్డ్ మేకింగ్ (డీటీడీఎం): 09 సీట్లు

2. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (డీఈసీఈ): 06 సీట్లు

3. డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్‌ రోబోటిక్స్ ఇంజినీరింగ్ (డీఏఆర్‌ఈ): 07 సీట్లు

4. డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ (డీపీఈ): 08 సీట్లు

వ్యవధి: డిప్లొమా ఇన్ టూల్, డై అండ్‌ మౌల్డ్ మేకింగ్ కోర్సుల మూడేళ్లు, ఇతర కోర్సులు రెండేళ్లు.

అర్హత: ఐటీఐ తరగతి ఉత్తీర్ణత. ప్రస్తుతం క్వాలిఫైయింగ్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: డీటీడీఎంకు 31 మే 2026 నాటికి 15 ఏళ్ల నుంచి 19 ఏళ్లు, డీఈసీఈ, డీఏఆర్‌ఈ అండ్‌ డీపీఈకు 31 మే 2026 నాటికి గరిష్టంగా 19 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్ల వరకు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా సీటు కేటాయిస్తారు. 

ప్రవేశ పరీక్ష విధానం: పరీక్ష అబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. సంబంధిత ట్రేడ్‌ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి.

దరఖాస్తు ఫీజు: రూ.1000, ఎస్సీ/ఎస్టీలకు రూ.500.

పరీక్ష వ్యవధి: ఒకటిన్నర గంటలు.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 31-05-2026.

ప్రవేశ పరీక్ష తేదీ: 15.06.2026.

ప్రవేశ పరీక్ష కేంద్రం: హైదరాబాద్.

Website:https://www.citd.in/index.php

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram