హెచ్‌ఏఎల్ హైదరాబాద్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు

హెచ్‌ఏఎల్ హైదరాబాద్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్), ఏవియానిక్స్ డివిజన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఒకేషనల్, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్, డిప్లొమా అభ్యర్థుల నుంచి అప్రెంటిస్ ట్రైనింగ్ కోసం దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 132   

వివరాలు:

1. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 68   

2. టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్: 30   

3. జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 34   

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా/డిగ్రీ/బీటెక్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు.  

ఇంటర్వ్యూ తేదీలు: 2026 జూన్‌ 2 నుంచి 5వరకు. 

వేదిక: ఉత్సవ్ సదన్ ఆడిటోరియం, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రైనింగ్ & డెవలప్‌మెంట్ వెనుక, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్), ఏవియానిక్స్ డివిజన్, బాలానగర్, హైదరాబాద్- 500042.

Website:https://www.hal-india.co.in/career

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram