ఎన్‌ఎఫ్‌ఎల్‌లో ఫీల్డ్ రిప్రజెంటేటివ్ పోస్టులు

ఎన్‌ఎఫ్‌ఎల్‌లో ఫీల్డ్ రిప్రజెంటేటివ్ పోస్టులు

నోయిడాలోని భారత ప్రభుత్వానికి చెందిన నవరత్న పబ్లిక్ సెక్టార్ సంస్థ అయిన నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్‌ఎఫ్‌ఎల్‌) మార్కెటింగ్ విభాగంలో నాన్-ఎగ్జిక్యూటివ్ స్థాయి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

ఫీల్డ్ రిప్రజెంటేటివ్ - ఎన్‌డీఎస్‌సీ సెంటర్ ఇన్ ఛార్జ్: 40 ఖాళీలు

(కేటగిరీ వారీగా ఖాళీలు: యూఆర్‌-20, ఎస్సీ-05, ఎస్టీ-02, ఓబీసీ-10, ఈడబ్ల్యూఎస్‌-03)

అర్హత: అభ్యర్థులు అగ్రికల్చర్ లేదా దానికి సంబంధించిన ఏదేని సబ్-డిసిప్లిన్‌లో ఫుల్ టైమ్ డిప్లొమా లేదా పాలిటెక్నిక్ పూర్తి చేసి ఉండాలి. హార్టికల్చర్ డిప్లొమా చేసిన వారు ఈ పోస్టుకు అర్హులు కారు.

వయోపరిమితి: 30.04.2026 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ.21,500- రూ.52,000.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు రుసుము: జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం, డిపార్ట్‌మెంట్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12/06/2026.

ఎడిట్/కరెక్షన్‌ విండో: 14/06/2026 నుంచి 15/06/2026. 

Website:https://careers.nfl.co.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram